![]() |
![]() |

కీర్తి కేశవ్ భట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెర ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న పేరు. 'మనసిచ్చి చూడు'' సీరియల్ లో భానుగా ఆడియన్స్ కి దగ్గరయింది కీర్తి. ఆ తర్వాత "కార్తీకదీపం" సీరియల్ నెక్స్ట్ జనరేషన్ కథలో పెద్దైన తర్వాత డాక్టర్ హిమగా ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ లో నటించింది. అమాయకమైన పాత్రలో తింగరి అనిపించుకుంటూ నటనపరంగా మంచి మార్కులే కొట్టేసింది.
అయితే త్వరలో "కార్తీకదీపం" సీరియల్ కి శుభం కార్డు పడబోతోంది. కీర్తి కొత్త సీరియల్ తో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. కార్తీకదీపం నెక్స్ట్ జనరేషన్ కథలో కనిపించిన కొన్నాళ్లకు బిగ్ బాస్ హౌజ్ లోకి వెళ్లింది...ఆ టైంలో సీరియల్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ నడిచాయి.. ఇప్పుడు స్టార్ మాలో 'మధురానగరి'లో రాధగా మురిపించేందుకు సిద్ధమైంది. కర్ణాటక బెంగుళూరులో జన్మించిన కీర్తికి చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను, అన్నా వదినను కోల్పోయిన ఈమె చాలా బాధలు అనుభవించింది. ఐనవాళ్లంతా దూరమైనా తనకు తానే ధైర్యం చెప్పుకుంది. చదువు పూర్తిచేసి కన్నడ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
అక్కడ రెండు సినిమాలు, మూడు సీరియల్స్ లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో "మనసిచ్చి చూడు" సీరియల్ తో ఎంట్రీ ఇచ్చి "కార్తీకదీపంలో" కనిపించింది. ఇప్పుడు "మధురానగరిలో" రాధగా వస్తోంది. కీర్తి జీవితం ఒక విషాదం...బిగ్ బాస్ హౌజ్ కి వెళ్ళాక ఆమె గురించి బుల్లితెర ఆడియన్స్ అందరికీ తెలిసింది. అప్పటి నుంచి కీర్తిని అంతా తమ ఫామిలీ మెంబర్ లా చూసుకోవడం స్టార్ట్ చేశారు. తోటి కంటిస్టెంట్స్ పేరెంట్స్ కూడా కీర్తిని సొంత బిడ్డలా భావించేవారు. అందరి ప్రేమను పొందిన కీర్తి తన కెరీర్ పరంగా మరింత ముందుకు వెళుతోంది.
![]() |
![]() |